మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తింటున్నామన్నదే కాదు.. ఆ ఆహారాన్ని ఎలా వండుతున్నాం, ఏ పాత్రలో వండుతున్నాం అన్నదీ ముఖ్యమే. కూరగాయలు, పప్పులు, ఆకుకూరలు, ఇతర పోషకాహారం తీసుకున్నా.. వంట విధానం సరిగ్గా లేకపోతే కొన్ని పోషకాలు తగ్గిపోవచ్చు. అంతేకాదు, వంట పాత్ర సరిగా లేకపోతే ఆ పాత్రలోని కొన్ని పదార్థాలు ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుంది.
అయితే ప్రతి పాత్రను చూసి భయపడాల్సిన అవసరం లేదు. సరైన నాణ్యత ఉన్న పాత్రను, సరైన విధానంలో ఉపయోగిస్తే వంటను సేఫ్‌గా చేసుకోవచ్చు. మరి ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్, నాన్‌స్టిక్, అల్యూమినియం పాత్రల్లో ఏది బెటర్, వాటిని వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు, నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం..


