మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువతులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. నస్పూర్ గేట్ సమీపంలోని నేషనల్ హైవేపై లారీ, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్లో పనిచేసేందుకు ఆ యువతులు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించారు.


