HomeTELANGANAమంచిరేవులలో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. రూ.1,108 కోట్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

మంచిరేవులలో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. రూ.1,108 కోట్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

మూసీ నది ఒడ్డున ప్రతిపాదించిన ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఆలయ సముదాయ నిర్మాణం, అభివృద్ధి పనులకు రూ.948.65 కోట్లు, 6 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.159.62 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.1,108.27 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఇస్తానా విల్లాస్‌ నుంచి కీర్తి వెస్ట్‌విండ్‌ విల్లాస్‌ వరకు 2.5 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించనున్నారు. ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ఆర్‌అండ్‌బీ, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ శాఖల ఉన్నతాధికారులతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments