అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ దగ్గర స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. విమానాశ్రయం నిర్మాణంలో ఉన్నప్పుడు స్థానిక గ్రామాల రహదారులు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల వాళ్లు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్కు దృష్టికి వెళ్లింది. వెంటనే చర్యలు తీసుకున్నారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని GMR సంస్థను ఆయన ఆదేశించారు. కేవలం మరమ్ముతులే కాకుండా అవసరమైన చోట శాశ్వత రహదారులను కూడా నిర్మించాలని సూచించారు.
‘భోగాపురం’ పనులతో.. పరిసర గ్రామాలకు దారి కష్టాలు.. తక్షణమే మరమ్మతు చేయాలని జీఎంఆర్కు కలెక్టర్ ఆదేశం
RELATED ARTICLES


