Botsa Anusha As Bheemili Constituency Ysrcp Incharge: భీమిలి నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా బొత్స అనూషను నియమించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఇటీవలే వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో బొత్స అనూషకు భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చారు. తాను 2029లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
భీమిలి వైసీపీ ఇంఛార్జ్‌గా బొత్స అనూష నియామకం.. 2029లో చీపురుపల్లిలో పోటీ చేస్తానన్న బొత్స సత్యనారాయణ
RELATED ARTICLES


