Gold Storage India: ఏ దేశానికైనా బంగారం అనేది కూడా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంటుంది. అయితే చాలా వరకు దేశాల బంగారం నిల్వలు వేరే చోట ఉంటాయి. సురక్షితంగా భద్రపరుస్తుంటాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వల్ని ఎక్కడ ఉంచాలనే దానిపై కొత్తగా ఆలోచిస్తున్నాయి. ఇటీవల నెదర్లాండ్స్ తమ బంగారాన్ని లండన్‌కు తరలించగా, ఫ్రాన్స్ న్యూయార్క్‌లోని కొన్ని బార్లను మార్చేసింది. భారత్ మాత్రం మన దేశానికే తెప్పిస్తుండటం గమనార్హం.


