HomeTELANGANAప్రభుత్వ బడుల్లో ఇక నో బ్యాగ్ డే.. క్లాస్‌రూమ్‌కు బ్రేక్‌, క్రియేటివిటీకి ఛాన్స్‌

ప్రభుత్వ బడుల్లో ఇక నో బ్యాగ్ డే.. క్లాస్‌రూమ్‌కు బ్రేక్‌, క్రియేటివిటీకి ఛాన్స్‌

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పది బ్యాగ్‌ లెస్‌ డేస్‌ నిర్వహించనున్నారు. ఆ రోజుల్లో విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండా పాఠశాలకు హాజరై సైన్స్‌ ప్రయోగాలు, క్విజ్‌లు, క్షేత్ర పర్యటనలు, చిత్రలేఖనం, నాటికలు, బాలసభలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన మాడ్యూల్స్‌ ఆధారంగా ఈ కార్యక్రమాలు సాగుతాయి. పిల్లల్లో సృజనాత్మకత, ఆచరణాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలను పెంచడమే లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments