HomeHeadlinesప్రధాని ఇల్లు ఉన్న ప్రాంతంలోనే మసీదుకు ముప్పు: కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన మెహబూబా ముఫ్తీ

ప్రధాని ఇల్లు ఉన్న ప్రాంతంలోనే మసీదుకు ముప్పు: కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన మెహబూబా ముఫ్తీ

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాన మంత్రి అధికారిక నివాసానికి అతి సమీపంలో, దశాబ్దాలుగా ఉన్న సుమారు 120 సంవత్సరాల నాటి చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు స్థానిక అధికారులు సడన్‌గా ఖాళీ నోటీసులు జారీ చేయడమే కాకుండా దానికి సంబంధించిన విద్యుత్, తాగునీటి సరఫరాను నిలిపివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విచిత్ర పరిణామంపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విదేశాల్లో ఇస్లామిక్ సంప్రదాయాలను గౌరవించే పాలకులు.. స్వదేశంలో మాత్రం తమ స్వంత ముస్లిం ప్రజల మనోభావాలను, చారిత్రక కట్టడాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ అవమానిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments