భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇవాళ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. బెంగళూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సేన జెట్లాగ్, ప్రయాణ బడలిక మధ్యే బరిలోకి దిగుతోంది. షెడ్యూల్ భారం ఎంత ఉన్నప్పటికీ వాటిని సాకులుగా చెప్పబోమని కెప్టెన్ స్పష్టం చేశాడు. మరోవైపు బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి పిలవడం ఆసక్తికరంగా మారింది.


