18 ఏళ్లలోపు బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నూతన ఆలోచనతో ముందుకొచ్చింది. బాలికలపై జరుగుతున్న అకృత్యాలపై పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా పోక్సో ఈ బాక్స్ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. బాలికలకు జరిగిన ఘటనను ఈ యాప్‌లో వివరిస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు. ఈ యాప్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాయి. బాధ్యులను కూడా వెంటనే శిక్షించేందుకే కేంద్రం ఈ యాప్‌ను తీసుకొచ్చింది.
పోక్సో ఈ బాక్స్.. ఆడపిల్లలకు అండగా పోక్సో యాప్.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసుకోవచ్చు!
RELATED ARTICLES


