పంజాబ్లోని ఎల్పీయూలో గ్యాంగ్ రేప్, ఆత్మహత్య జరిగినట్లు వార్తలు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సుమారు 2 వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగగా.. పరిస్థితి క్రమంగా హింసాత్మకంగా మారింది. క్యాంపస్లో కిటికీలు, ఇతర సామగ్రిని విద్యార్థులు ధ్వంసం చేయడంతో పాటు కొన్ని వస్తువులకు నిప్పు పెట్టారు. అనంతరం జలంధర్-ఫగ్వారా నేషనల్ హైవేను కూడా దిగ్బంధించారు. అయితే అత్యాచార ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఇప్పటివరకు ఆధారాలు కూడా లభించలేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ కూడా ఈ ప్రచారం అంతా తప్పు అని ఖండించింది.


