తెలుగు మూలాలున్న అమెరికన్ న్యాయవాది కోమటిరెడ్డి సరిత న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 15న బహిరంగ మద్దతు ప్రకటించారు. హార్వర్డ్‌లో న్యాయ విద్య పూర్తి చేసిన సరిత ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా ఉగ్రవాదం, డ్రగ్స్, సైబర్ నేరాలు, మనీలాండరింగ్ కేసుల్లో పనిచేశారు. తెలంగాణకు చెందిన వైద్య దంపతుల కుమార్తెగా అమెరికాలో పుట్టి పెరిగిన సరిత.. ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్‌ను ఢీకొంటున్నారు.


