Ys Sharmila On Meet Ys Jagan Soon: సోషల్ మీడియాలో తనపై అల్లుతున్నవి కట్టుకథలన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తన కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన ఖర్మ తనకు లేదన్నారు. శుభకార్యానికి, రాజకీయాలకు లింక్ పెట్టొద్దని కోరారు. అలాగే వైఎస్ జగన్ను కలవడంపై కూడా స్పష్టత ఇచ్చారు. ఒకవేళ తాను జగన్ను కలిసినా.. అది కేవలం తన బిడ్డ వివాహానికి ఆహ్వానించడానికి మాత్రమే అన్నారు షర్మిల.
నేను జగన్ను చివరిసారిగా ఆరోజే కలిశాను.. కూతురు పెళ్లి అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే ఖర్మ YSR బిడ్డగా నాకు లేదు: షర్మిల
RELATED ARTICLES


