తల దువ్వుకున్న ప్రతిసారీ భుజాలపై తెల్లటి పొరల్లా చుండ్రు రాలడం, స్కాల్ప్‌లో దురదతో పదేపదే గోకాల్సి రావడం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో తేమ, చెమట, స్కాల్ప్‌లో పెరిగే జిడ్డు కారణంగా ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చుండ్రును తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే షాంపూలతో పాటు ఇంటి చిట్కాలను ప్రయత్నించేవారు చాలామందే. అందులో నిమ్మరసం కూడా ప్రముఖంగా వినిపించే చిట్కా. ఇంటి చిట్కాల్లో చుండ్రు సమస్యను నివారించడానికి నిమ్మకాయకు చాలా ఫేమస్ అని చెప్పొచ్చు.
నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ గుణాలు స్కాల్ప్‌లోని అదనపు జిడ్డును తొలగిస్తాయని, చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయని కొందరు నమ్ముతారు. అందుకే నిమ్మరసాన్ని నేరుగా తలకు రాయడం, ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగించడం వంటి చిట్కాలు చాలాకాలంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే నిమ్మరసం నిజంగా చుండ్రును తగ్గిస్తుందా? చుండ్రు కోసం నిమ్మరసం ఉపయోగించడం వల్ల నిజంగా ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం..


