HomeAndhra Pradeshధర్మవరం వన్‌టౌన్ పరిధిలో 8 మంది రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల బైండోవర్

ధర్మవరం వన్‌టౌన్ పరిధిలో 8 మంది రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల బైండోవర్

ఎర్రగుంట్ల ప్రాంతానికి చెందిన 8 మందిని బైండోవర్ చేసిన పోలీసులు

ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు.. ఏడాది పాటు బైండోవర్

ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున సూరిటీ సమర్పణ

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి

నేరాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని పోలీసుల హెచ్చరిక

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు: పోలీసులు

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం వన్ టౌన్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగుంట్ల ప్రాంతానికి చెందిన 8 మంది రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను పోలీసులు శనివారం బైండోవర్ చేశారు. అనంతరం వారిని ధర్మవరం పట్టణ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు.

ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు ఒక్కొక్కరిని ఏడాది కాలానికి బైండోవర్ చేస్తూ, రూ.5 లక్షల చొప్పున సూరిటీ సమర్పించాలని ఆదేశించారు. దీంతో సంబంధిత వ్యక్తులు ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయంలో సూరిటీలు సమర్పించారు.

బైండోవర్‌ కాల పరిమితిలో సదరు వ్యక్తులు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. బైండోవర్‌ నిబంధనలను ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే సూరిటీగా సమర్పించిన రూ.5 లక్షలను ప్రభుత్వానికి చెల్లించాల్సి రావడంతో పాటు, నిబంధనల మేరకు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజా శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments