ముంబైలోని రాధాకృష్ణ హోటల్లో మైసూర్ మసాలా దోశలో ఎలుక వచ్చిందంటూ ఫిర్యాదు చేసిన మహిళే.. ఆపై యజమానిని రూ. 25 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసి హోటల్ లైసెన్స్ రద్దు కాగా.. కేసు ముగించేందుకు రూ. 6 లక్షల ఒప్పందం చేసుకుని, రూ. 6 లక్షల లంచం తీసుకుంటుండగా ప్రధాన నిందితురాలు మాన్సి ఆచార్యను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.


