తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక ప్రకటన వెలువడింది. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల రాతపరీక్షల తేదీలను టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది. ఎస్ఐ పోస్టులకు నవంబర్ 29న.. కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 5,77,064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్ఐ పోస్టులకు 1,60,756 మంది.. కానిస్టేబుల్ పోస్టులకు 3,89,356 మంది దరఖాస్తు చేశారు.


