భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ద్వారా సరికొత్త మైలురాయిపై కన్నేశాడు. ప్రస్తుతం వన్డేల్లో 14,941 పరుగులతో ఉన్న విరాట్, తొలి మ్యాచ్‌లో మరో 59 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ తర్వాత 15,000 వన్డే పరుగులు సాధించిన ప్రపంచంలోనే రెండో బ్యాటర్‌గా నిలుస్తాడు. అలాగే స్వదేశంలో సచిన్ పేరిట ఉన్న అత్యధిక వన్డే పరుగుల రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి మరో 110 పరుగులు అవసరం. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.


