HomeAndhra Pradeshతప్పిన ముప్పు.. తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర తెగి పడిన విద్యుత్ తీగలు.. నిలిచిపోయిన రైళ్లు

తప్పిన ముప్పు.. తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర తెగి పడిన విద్యుత్ తీగలు.. నిలిచిపోయిన రైళ్లు

గుంటూరుజిల్లా తెనాలి రైల్వే స్టేషన్‌ దగ్గర అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్స్‌కు విద్యుత్ సరఫరా చేసే కరెంట్ తీగలు అకస్మాత్తుగా తెగిపడ్డాయి. అదీ కూడా గుంటూరు నుంచి రేపల్లె వెళ్లే ప్యాసింజర్ రైలుపై భాగంలోని విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగి ఆ ట్రైన్‌పై పడ్డాయి. దాంతో నిప్పు రవ్వలు కూడా ఎగిశాయి. అయితే ఆ విద్యుత్ తీగలు తెగి పడినా విద్యుత్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం రైల్వే అధికారులు రంగంలోకి దిగి రెండు గంటల పాటు శ్రమించి మరమ్మతులు చేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments