HomeTELANGANAట్రాఫిక్ చలాన్ల వసూళ్లలో తేడాలు.. రామగుండం కమిషనరేట్ పరిధిలో నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

ట్రాఫిక్ చలాన్ల వసూళ్లలో తేడాలు.. రామగుండం కమిషనరేట్ పరిధిలో నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ చలాన్ల జారీ, జరిమానాల వసూళ్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో మంచిర్యాల, నస్పూర్, చెన్నూరు, లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్లకు చెందిన నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. 2024–2026 మధ్య చలాన్ల వివరాలు, వసూళ్ల మొత్తాల మధ్య వ్యత్యాసాలు గుర్తించినట్లు సమాచారం. మరో 12 మంది కానిస్టేబుళ్లకు మెమోలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఆడిట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. కమిషనరేట్ పరిధిలోనూ తనిఖీలు చేపట్టారు. ఆరోపణలపై పూర్తి విచారణ జరగాల్సి ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments