ముంబై, ఢిల్లీలలో ‘లెహ్రా దో తిరంగా’ ఆందోళనల వేళ తనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే తెలిపారు. అంతేకాకుండా జాతీయ జెండాను ఎగురవేసేందుకు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు కన్నాట్ ప్లేస్ వద్ద 6,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.


