తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలను డిసెంబరులో నిర్వహించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతోపాటు గతంలో ఎన్నికలు జరగని ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్ ప్రక్రియలో నిమగ్నమైన పురపాలక సిబ్బందికి అక్టోబరు తర్వాత విరామం ఇచ్చి డిసెంబరులో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


