Jio Platforms IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదిత రూ. 30 వేల కోట్ల ఐపీఓపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ విదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ఇప్పటికే వాటాలు కలిగిన మెటా, గూగుల్ సహా మరికొందరు ఇన్వెస్టర్లు ఇక్కడ తమ పెట్టుబడులను పెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.


