అతి ఎప్పుడు అనర్థమే. ఇది అన్నీ విషయాల్లోనూ వర్తిస్తుంది. ఏ బెనిఫిట్ అందాలన్నా కూడా ఒక్కసారిగా పొందలేం. వాటికంటూ కాస్తా టైమ్ పడుతుంది. అంతేకానీ, ఇన్స్టంట్, ష్టార్ట్ టైమ్ రిజల్ట్స్ రావాలంటే వాటి వల్ల వచ్చే సమస్యలు తక్కువేం కాదు. అందుకే, ఫిట్‌గా మారాలని ఒకేసారి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం, గంటల తరబడి జిమ్‌లోనే గడపడం అఎవిరికైనా అంత మంచిది కాదు. దీని వల్ల ఫిట్‌గా మారడం పక్కనపెడితే అనుకోని అనర్థాలు వస్తాయి. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. వాటి గురించి డాక్టర్ పవన్ పొద్దార్(డైరెక్టర్ ఆఫ్ కాత్ ల్యాబ్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) ముఖ్య విషయాలు చెబుతున్నారు.


