ప్రస్తుత బిజీ లైఫ్స్టైల్లో రోగనిరోధక శక్తిని పెంచడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి రకరకాల సప్లిమెంట్లు, క్షణాల్లో ఫలితాలనిచ్చే చిట్కాలపై ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రోగనిరోధక శక్తి అనేది ఏదో ఒక మందుతోనో లేదా ఒక్క రోజులోనే వచ్చేది కాదు. ఇది క్రమం తప్పుకుండా తీసుకునే సమతుల్య ఆహారం, మంచి లైఫ్‌స్టైల్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
ముఖ్యంగా పిల్లల విషయంలో తొలి దశలో అందించే సరైన పోషణ వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో ముఖ్యం. ఇక, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ కూడా ఇమ్యూనిటీ అవసరం. కుటుంబంలోని ప్రతి ఒక్కటి ఇమ్యూనిటీని పెంపొందించే న్యూట్రిషన్ చిట్కాల్ని డాక్టర్ బత్తుల ఐశ్వర్య (సీనియర్ హెల్త్ కోచ్ & క్లినికల్ న్యూట్రిషనిస్ట్, అంకురా హాస్పిటల్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రెన్, మదీనాగూడ) అందించారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


