తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వినాయక నిమజ్జన వేడుకలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. నిమజ్జన ఊరేగింపుల సందర్భాల్లో పలువురు ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో డీజేల మోతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తి, శ్రద్ధలు, ఆనందాలు, కోలాహలాలతో సాగాల్సిన వినాయక నిమజ్జనాల్లో జరుగుతున్న ఇలాంటి విషాదాలు.. తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు తన ఉండి నియోజకవర్గంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
గణేష్ నిమజ్జనాల్లో డీజే మోత.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో గుండెపోటుతో ఐదుగురు మృతి, రఘురామ కీలక నిర్ణయం
RELATED ARTICLES


