HomeAndhra Pradeshక్యాన్సర్ రోగులకు ఉపశమనం.. కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం..

క్యాన్సర్ రోగులకు ఉపశమనం.. కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. కాకినాడ సర్వజనాసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుంది. రూ. 36.6 కోట్లతో కాకినాడ జీజీహెచ్‌లో రేడియోథెరపీ లీనాక్ యంత్రం ఏర్పాటు చేయనున్నారు. ఓఎన్జీసీ సంస్థ సీఎస్ఆర్ నిధుల నుంచి దీనికి కావాల్సిన నిధులను మంజూరు చేయనున్నారు. దీని ద్వారా ఏడు జిల్లాల పరిధిలో క్యాన్సర్ రోగులకు ఉపయోగం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రూ. 3.5 కోట్ల విలువైన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments