HomeEntertainmentకోలుకుంటున్న ‘గబ్బర్ సింగ్’ రమేశ్... పెద్ద మనసుతో ఆర్థిక సాయం చేసిన ‘కాంచన’ ఫేమ్ ...

కోలుకుంటున్న ‘గబ్బర్ సింగ్’ రమేశ్… పెద్ద మనసుతో ఆర్థిక సాయం చేసిన ‘కాంచన’ ఫేమ్ శ్రీమాన్

పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’లో విలన్ అంత్యాక్షరి గ్యాంగ్ సభ్యుడిగా అలరించిన నటుడు రమేశ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. కాగా, రమేశ్ పరిస్థితి తెలుసుకున్న ‘కాంచన’ ఫేమ్ నటుడు శ్రీమాన్ వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. గతంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు. ఆపదలో ఉన్న తోటి నటుడికి పెద్ద మనసుతో అండగా నిలిచిన శ్రీమాన్‌కు ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments