కొంతమంది బరువు తగ్గాలని ఎంత ట్రై చేస్తారో.. మరికొంతమంది పెరగాలని అంతే ట్రై చేస్తారు. ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు. ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఎలాంటి వర్కౌట్స్ లేకుండా హాయిగా రెస్ట్ తీసుకోవడం వంటివన్నీ చేస్తుంటారు. అయితే, ఇవన్నీ చేసినప్పటికీ బరువు మాత్రం పెరగరు. దానిని చూసి చాలా మంది నువ్వు చాలా లక్కీ ఎంత తిన్నా బరువు పెరగవు అని అంటారు. కానీ, బరువు పెరగకపోయినా అన్‌హెల్దీ లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ కారణంగా ఇంటర్నల్‌గా మాత్రం కొలెస్ట్రాల్ పెరగడం, జబ్బులు పెరగడం వంటివి జరుగుతాయి. దీంతో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అసలు బరువు ఎందుకు పెరగరు. ఇదేమైనా సమస్య? నేచురల్‌గా ఎలాంటి హాని లేకుండా ఎలా బరువు పెరగాలి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి.


