కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. కొన్ని నెలల క్రితం చెప్పిన జోస్యానికి సంబంధించి వీడియో వైరల్గా మారింది. అందులో తెలుగు రాష్ట్రాల్లోని దేవాదాయ శాఖ విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పడం గమనార్హం.


