రాత్రివేళ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణిస్తుండగా.. ఓ నిర్మానుష్య ప్రదేశంలో టైరు పంక్చరయ్యింది. దీంతో చుట్టుపక్కల సాయం కోసం అతడు ఎదురుచూశాడు. కానీ, అందుబాటులో మెకానిక్ లేకపోవడంతో అక్కడ ఓ దాబా ఉండటంతో కారును అక్కడే పార్క్ చేశాడు. తలుపులన్నీ మూసి, లాక్ చేసి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం అక్కడకు వెళ్లేసరికి కారు పూర్తిగా మంటల్లో కాలిబూడిదయ్యింది. ఏం జరిగిందో తెలియని స్థితిలో ఉన్న అతడు.. దిగ్భ్రాంతి నుంచి తేరుకున్నాడు. బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయగా.. రోడ్డుపక్కన వదిలేసి వెళ్లిపోయారని, బీమా ఇవ్వలేమని వాదించింది.


