మినీ వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తమ కోచింగ్ బృందాన్ని మరింత పటిష్టం చేసుకునే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను జట్టు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించింది. హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ, అసిస్టెంట్ కోచ్ యువరాజ్ సింగ్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ చమిందా వాస్లతో కూడిన దిగ్గజాల జాబితాలో ఇప్పుడు అమిత్ మిశ్రా కూడా చేరాడు.


