రాబోయే ఐపీఎల్ సీజన్ ఆటగాళ్ల వేలానికి బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. డిసెంబర్ 16న గోవాలోని ప్రముఖ ఐటీసీ గ్రాండ్ గోవా హోటల్ వేదికగా ఈ వేలం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు బీసీసీఐ లాజిస్టిక్స్ టీమ్ ఫ్రాంచైజీలకు వాట్సాప్ సందేశం ద్వారా సమాచారం అందించింది! వేలానికి హాజరయ్యే ప్రతినిధుల వివరాలను అందించాలని కోరిన బోర్డు, త్వరలోనే దీనిపై అధికారిక ఈమెయిల్ పంపనుంది. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.


