భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) సంచలన ప్రకటన చేసింది. ప్రియగోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా, దొడ్ల పాలలో డిటర్జెంట్ అవశేషాలు ఉన్నట్టు గుర్తించామని వాటిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని FSSAI తెలిపింది. ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో తయారీ కేంద్రంపై తనిఖీలు నిర్వహించి, అక్కడ పరిస్థితులను గమనించామని FSSAI వెల్లడించింది. వీటితో పాటు రూల్స్ని పాటించని మరో మూడు కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేసినట్టు FSSAI తెలిపింది.


