ఏపీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు ఆమె విజయవాడలో పర్యటించనున్నారు. మొదటి రోజు ఆమె కొండపై కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. మర్నాడు అంటే 15వ తేదీన పున్నమి ఘాట్‌లో నిర్వహించే జాతీయ స్థాయి సరస్ మేళా ప్రోగ్రామ్‌కు ఆమె హాజరవుతారు. అనంతరం లఖ్పతి దీదీలతో ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అదేరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. కాగా దసరా పండుగ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం.. విజయవాడలో పటిష్ట భద్రత
RELATED ARTICLES


