HomeTELANGANAఎడమ కంటికి బదులు కుడి కంటికి ఆపరేషన్.. ప్రైవేటు ఆస్పత్రి తీరుపై మానవ హక్కుల సంఘం...

ఎడమ కంటికి బదులు కుడి కంటికి ఆపరేషన్.. ప్రైవేటు ఆస్పత్రి తీరుపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం

కంటి ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎడమ కంటికి సమస్య ఉండగా.. ఆస్పత్రి డాక్టర్లు కుడి కంటి ఆపరేషన్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. ఆరోపణలు నిజమైతే వైద్య నిర్లక్ష్యం, రోగి భద్రత, శస్త్రచికిత్సకు ముందు తీసుకున్న సమ్మతి వంటి అంశాలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతాయని కమిషన్ పేర్కొంది. ఈ ఘటనపై డీఎంహెచ్ఓను సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments