మనం రోజులో ఎక్కువసమయం గడిపేది ఇంట్లోనే. అందుకే ఉన్న ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. అయితే, అదేంటో ఎన్నిసార్లు దులిపినా ఎంత క్లీన్ చేసినా కొన్నిసార్లు ఇంట్లో దుమ్ము కనిపిస్తూనే ఉంటుంది. దీనికి కారణాలు ఎన్నో ఉంటాయి. వాటన్నింటినీ దూరం చేసి శుభ్రం చేసే పద్ధతిలో క్లీన్ చేస్తే ఇల్లు తళతళ మెరుస్తుంది. దీనికోసం కొత్తకొత్త టెక్నిక్స్ అవసరం లేదండి. కొన్ని మార్పులు చేయాలి. మనం రోజూ చేసే పనులే కాస్తా మార్చి కొన్ని అలవాట్లు చేసుకుంటే చక్కగా కనిపిస్తుంది ఇల్లు.


