Union Minister Rammohan Naidu On Port In Ichchapuram: ఉత్తరాంధ్రకు త్వరలోనే మరో పోర్టు రాబోతుందన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఇచ్చాపురం నియోజకవర్గంలో 2వేల ఎకరాల్లో ఈ పోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పోర్టు ఏర్పాటైతే అనుబంధ పరిశ్రమలు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. రామ్మోహన్ నాయుడు ఇచ్చాపురం నియోజవకర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇచ్చాపురంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు.
ఉత్తరాంధ్రలో కొత్తగా మరో పోర్టు.. 2 వేల ఎకరాల్లో.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
RELATED ARTICLES


