దేశంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాల ఆరోపణలతో వివాదాస్పదమవుతోంది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్యంగా సీఈసీ నిర్ణయాలను ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారని ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనంతో మరింత అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలో ఈసీ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. ముగ్గురు కమిషనర్లతో కూడి ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని స్పష్టత ఇచ్చింది.


