ESDS Software Solution IPO GMP: భారత స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గత 4 సెషన్లలో సూచీలు వరుసగా పడిపోగా కనిష్ఠ స్థాయిల వద్ద ఇవాళ కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. సెన్సెక్స్ 600, నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభాల్లో ట్రేడవుతుండగా, ఇదే సమయంలో ఒక ఐపీఓ ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే స్థాయిలో రిటర్న్స్ ఇచ్చింది. తొలుత 76 శాతం ప్రీమియంతో ఎంట్రీ ఇవ్వగా, అక్కడి నుంచి మళ్లీ 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది.


