DA Hike Calculator: పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఏటా రెండుసార్లు డీఏ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. పెన్షనర్లకు ఇక్కడ డియర్నెస్ రిలీఫ్ (DR) అందిస్తుంది. ప్రస్తుతం ఇది 60 శాతంగా ఉండగా ఇప్పుడు ఏకంగా 64 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. దసరాదీపావళి సమయంలో దీనిపై ప్రకటన రానుంది. ఎప్పుడు ప్రకటించినా బకాయిలతో కలిపి జులై 1 నుంచే పెరగాల్సిన డీఏ చెల్లిస్తారు.


