HomeTELANGANAఅమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో మాట్లాడిన కొద్దిసేపటికే విషాదం

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో మాట్లాడిన కొద్దిసేపటికే విషాదం

అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడాలని ఆశించిన ఖమ్మం యువతి అక్షిత గుండెపోటుతో మరణించారు. ఎప్పటిలాగే జిమ్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆమె.. సోదరుడితో కలిసి భోజనం చేశారు. అనంతరం తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే వాకింగ్ చేస్తూ కుప్పకూలిపోయారు. వైద్యులు సీపీఆర్‌ చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది. యువతలో గుండె సంబంధిత సమస్యలకు కుటుంబ చరిత్ర, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, జీవనశైలి వంటి అంశాలు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments