కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల, ఆనందపురం గ్రామాలకు చెందిన తొమ్మిది జంటలు తమ పిల్లల సమక్షంలో మళ్లీ వివాహం (మరు మాంగళ్యధారణ) చేసుకున్నారు. కుటుంబంలో వరుసగా ఎదురవుతున్న ఆర్థిక, అనారోగ్య సమస్యల నివారణకై సిద్ధాంతి సలహా మేరకు గత వివాహ దోషాల నివారణ కోసం శ్రావణ మాసంలో ఈ వేడుకను నిర్వహించారు. శాస్త్రోక్తంగా తలంబ్రాలు, జీలకర్ర బెల్లం ప్రధాన ఘట్టాలతో మళ్లీ పెళ్లి చేసుకుని, అనంతరం సత్యదేవుని వ్రతం ఆచరించారు.


