Inspirational story: కుటుంబానికి తన వంతుగా అండగా ఉండేందుకు చిన్నప్పుడు రోజుకు 3 రూపాయల కోసం కూలీకి వెళ్లిన ఒక వ్యక్తి ఇప్పుడు రూ.160 కోట్ల సామ్రాజ్యం నిర్మించారు. కష్టాలకు ఎదురు నిలబడి గెలిచి నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయనే పుణేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ వర్మ. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్థిరాస్తి రంగంలో సామ్రాజ్యం నిర్మించారు. ఆయన స్పూర్తిదాయక జీవిత ప్రయాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండీ.



