HomeEntertainmentSpirit Postponed: ‘రామాయణ’ పార్ట్ 2కి పోటీగా ‘స్పిరిట్’... 2027 దీపావళికి వస్తున్న ప్రభాస్-వంగా మూవీ

Spirit Postponed: ‘రామాయణ’ పార్ట్ 2కి పోటీగా ‘స్పిరిట్’… 2027 దీపావళికి వస్తున్న ప్రభాస్-వంగా మూవీ

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ విడుదల వాయిదా పడింది. తొలుత 2027 సమ్మర్‌ కానుకగా మార్చి 5న విడుదల చేయాలని భావించినప్పటికీ తాజాగా ఈ సినిమాను 2027 అక్టోబర్ 29న దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ క్యాప్, గడ్డంతో ఇంటెన్స్ పోలీస్ లుక్‌లో కనిపించారు. త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం కోసం ఇంకా ఏడాదికి పైగా వేచి చూడాల్సి రావడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments