India Rice Exports: ఎల్నినో ప్రభావం కారణంగా ఈసారి సాగు అంతలా సాగలేదు. దీంతో పంట పండించిన వారు పండగ చేసుకుంటున్నారు. విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో ధరలు భారీగా పెరిగాయి. భారత బియ్యం ఎగుమతి ధరలు కూడా ఏడాదికిపైగా గరిష్ఠాలకు చేరుకున్నాయి. రూపాయి బలపడటం, దేశీయంగా వరి సరఫరా తగ్గడం, కొన్ని రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం దీనికి కారణాలుగా ఉన్నాయి. మరోవైపు వియత్నాం, థాయిలాండ్లోనూ బియ్యం ధరలు పెరిగాయి.


