HomeEntertainmentRajinikanth: తలైవా మేనియాకు థియేటర్లు షేక్.. ‘జైలర్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Rajinikanth: తలైవా మేనియాకు థియేటర్లు షేక్.. ‘జైలర్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్ 2’ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.125.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సత్తా చాటింది. సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. భారత్‌లోనే రూ.70.25 కోట్ల గ్రాస్ (రూ.59.70 కోట్ల నెట్) రాబట్టగా, విదేశాల నుంచి మరో రూ.55 కోట్లు వచ్చాయి. తెలుగులో రూ.12.50 కోట్ల నెట్ వసూళ్లు నమోదు కావడం విశేషం. ‘కూలీ’ (రూ.151.75 కోట్లు) తర్వాత రజనీకాంత్ కెరీర్‌లో ఇది రెండో అతిపెద్ద ఓపెనర్‌గా నిలవగా, భారీ స్టార్ కాస్ట్‌తో వచ్చిన ఈ మూవీ వీకెండ్‌లో మరిన్ని కలెక్షన్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments