ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేపాల్ ఇండియాలో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల్లోని టెక్, ఇంజినీరింగ్ వర్కర్లపై ఈ లేఆఫ్‌ల ప్రభావం పడగా, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


