రతన్ టాటా ఉన్నత కుటుంబంలో పుట్టినా, టాటా గ్రూప్‌లో నేరుగా ఉన్నత పదవిని చేపట్టలేదు. 1961లో టాటా స్టీల్ (జంషెడ్‌పూర్) కర్మాగారంలో సాధారణ ఉద్యోగిగా సున్నం కలపడం, బ్లాస్ట్ ఫర్నేస్‌లలో పనిచేయడం ద్వారా గ్రౌండ్-లెవల్ అనుభవాన్ని సంపాదించారు. ఆయన ఛైర్మన్‌గా ఉన్న కాలంలో టాటా గ్రూప్ ఆదాయం 40 రెట్లకు పైగా, లాభాలు 50 రెట్లకు పైగా పెరిగాయి. టెట్లీ టీ (Tetley), కోరస్ స్టీల్ (Corus), జేఎల్‌ఆర్ (JLR) వంటి అంతర్జాతీయ సంస్థల్ని కొనుగోలు చేసి, భారతీయ సంస్థల సత్తాను ప్రపంచానికి చాటారు. ఆయన చెప్పిన మోటివేషనల్ కోట్స్ ఇప్పటికీ ఎందరికో స్పూర్తినిస్తున్నాయి.


