Jio IPO Anchor Book Subscription: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు ఇప్పుడు జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 19న యాంకర్ ఇన్వెస్టర్లు ఇందులో షేర్ల కోసం ఎగబడ్డారు. ఏకంగా 30 రెట్లకుపైగా రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21న రిటైల్ ఇన్వెస్టర్లు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుండగా దీనిపైనే అందరి దృష్టి నెలకొంది. రోజురోజుకూ జీఎంపీ పెరుగుతుండటం మరింత ఆసక్తి కలిగిస్తోంది.


